ఒంటరి తోడేలు కథ
హీరో రామ్ పోతినేని తొలిసారి మెగాఫోన్ పట్టబోతున్నారు. ఇప్పటికే నటనతో పాటు గాయకుడిగా, గీత రచయితగా సత్తాచాటిన ఆయన దర్శకుడిగా ప్రతిభను చాటేందుకు సిద్ధమవుతున్నారు. తన 23వ సినిమాతో రామ్ పోతినేని దర్శకుడిగా సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు.
హీరో రామ్ పోతినేని తొలిసారి మెగాఫోన్ పట్టబోతున్నారు. ఇప్పటికే నటనతో పాటు గాయకుడిగా, గీత రచయితగా సత్తాచాటిన ఆయన దర్శకుడిగా ప్రతిభను చాటేందుకు సిద్ధమవుతున్నారు. తన 23వ సినిమాతో రామ్ పోతినేని దర్శకుడిగా సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. స్వీయ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించే ఈ సినిమా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ‘రాపో’ సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. శుక్రవారం రామ్ పోతినేని జన్మదినం సందర్భంగా స్పెషల్ బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో ఆయన ‘వీర’ పాత్రలో కనిపించనున్నారు. ‘ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వూల్ఫ్’ అనే క్యాప్షన్ ఆయన పాత్ర తాలూకు ఇంటెన్సిటీని ప్రతిబింబిస్తున్నది. మానసిక సంఘర్షణతో కూడిన ఈ పాత్రలో రామ్ అగ్రెసివ్ యాటిట్యూడ్ కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడని, ఆయన మేకోవర్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

