Randeep Hooda | 47 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ నటుడు.. వధువు ఎవరంటే.?
Lin Laishram | 2023లో చాలామంది సెలబ్రిటీలు, తమ బ్యాచ్‌లర్ లైఫ్‌కు చెక్ పెట్టారు. నచ్చిన అమ్మాయి, అబ్బాయితో ఏడడుగులు నడిచి వివాహ బంధానికి వెల్కమ్ చెప్పారు. అయితే తాజాగా మరో స్టార్ జంట పెళ్లి చేసుకోబోతుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు.
Lin Laishram | 2023లో చాలామంది సెలబ్రిటీలు, తమ బ్యాచ్‌లర్ లైఫ్‌కు చెక్ పెట్టారు. నచ్చిన అమ్మాయి, అబ్బాయితో ఏడడుగులు నడిచి వివాహ బంధానికి వెల్కమ్ చెప్పారు. అయితే తాజాగా మరో స్టార్ జంట పెళ్లి చేసుకోబోతుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. 47 ఏళ్ల వయసులో తన ప్రియురాలు బాలీవుడ్ మోడల్ లిన్ లైస్రామ్ (37)ను మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ.. ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
మహాభారతంలో మణిపుర్ యువరాణి చిత్రాంగదను అర్జునుడు ఎక్కడ వివాహం చేసుకున్నాడో.. అక్కడే మేము ఒక్కటి కాబోతున్నాం. ఈ నెల 29న ఇంఫాల్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలో మా (రణ్‌దీప్ హుడా, లిన్ లైస్రామ్) పెళ్లి జరగనుంది. త్వరలోనే ముంబయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నాం. మా ప్రయాణానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం అని రణ్‌దీప్ హుడా ఇన్‌స్టాలో రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
2001లో రిలీజైన మన్సూన్ వెడ్డింగ్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు రణ్‌దీప్ హుడా. ఇక ఆయన నటించిన చిత్రాలలో ‘జిస్మ్ 2’, ‘బాంబే టాకీస్’, ‘కిక్’, ‘హైవే’ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ప్రస్తుతం బీజేపీ ప్రాపగాండా మూవీ ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ చిత్రంలో నటిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

