ప్రతి సంవత్సరంలో డిసెంబర్ నెల ఎంతో ఇష్టమైనది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆ నెల నాకు సెంటిమెంట్‌గా.. లక్కీ మంత్‌గా భావిస్తాను. నా మొదటి సినిమా ‘కిరిక్ పార్టీ’ డిసెంబర్లో విడుదలై సూపర్ హిట్ సాధించింది. నేను నటించిన నాలుగు చిత్రాలు అదే నెలలో విడుదలై సక్సెస్ అయ్యాయి. నాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ‘పుష్ప’ కూడా డిసెంబరులోనే విడుదలైంది. ఇక త్వరలోనే నేను నటిస్తున్న ‘యానిమల్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం నా కెరీర్లో ఎంతో స్పెషల్‌గా భావిస్తాను. ఇందులో నా పాత్రను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఎంతో కష్టతరమైన పాత్ర. ఇప్పటి వరకు నా కెరీర్లో ఇలాంటి పాత్ర చేయలేదు’ అని చెప్పుకొచ్చారు రష్మిక. ప్రస్తుతం రష్మిక మూడు సినిమాల్లో నటిస్తోంది. సందీప్ వంగా దర్శకత్వంలో ‘యానిమల్’, సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప-2’,వీటితో పాటు ‘రెయిన్బో’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాను చేస్తున్నారు.