‘యానిమల్’ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్‌కపూర్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ పాన్ ఇండియా స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటున్నది. తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా ఈ సినిమాను రూపొందించారు. ఇదిలా వుండగా అగ్ర హీరో బాలకృష్ణ ప్రయోక్తగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోలో ‘యానిమల్’ చిత్ర బృందం సందడి చేసింది.
ఈ సందర్భంగా తెలుగులో ఇష్టమైన హీరో ఎవరని రణబీర్‌కపూర్‌ను ప్రశ్నించగా… టాలీవుడ్లో తాను ప్రభాస్ ఫ్యాన్‌నని చెప్పారు. ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్‌తో కలిసి నటించాలనుందని, అందుకు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సహాయం చేయాలని రణబీర్‌కపూర్ కోరారు. ‘సందీప్‌రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ అన్న ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నారు. అందులో చిన్న పాత్రను ఆఫర్ చేసినా సంతోషంగా చేస్తా’ అని రణబీర్‌కపూర్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.