బాలీవుడ్ (Bollywood) ప్రేమ జంటలు పెళ్లి పీటలెక్కడం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే కత్రీనా కైఫ్, వికీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ సెలబ్రిటీ లవ్ మ్యారేజ్ లు లేకుండా ఒక్క క్యాలెండర్ కూడా తిరగదు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt)కూడా పెళ్లికి సిద్ధమవుతున్నారు. ముందుగా ఈ జంట అక్టోబర్లో ఏడడుగులు వేయనుందని ప్రచారం జరిగినా…ఇప్పుడు ఇంకాస్త ముందుగానే దంపతులు అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం.
ప్రస్తుతం ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ కలిసి బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటు వాళ్ల ఇంట్ల పెళ్లి పనులు ప్రారంభమైనట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తున్నది. ఏప్రిల్ లో ఈ జంట వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారట. డిజైనర్ మనీష్ మల్హోత్రాను రణ్ బీర్ తల్లి నీతూ కపూర్ కలిసి వీళ్ల పెళ్లి పనులు ప్రారంభించింది. ఈ ప్రముఖ డిజైనర్ రణ్ బీర్ ఇంటికి పలుమార్లు వెళ్లి మాట్లాడి వచ్చారు.
తాము ప్రస్తుతం సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతల దగ్గర ఏప్రిల్లో అనుకుంటున్న షెడ్యూల్ నుంచి పర్మిషన్ తీసుకుంటున్నారు అలియా రణ్ బీర్. దీంతో వచ్చే నెలలోనే ఓ మంచి ముహూర్తానికి (Ranbir Alia wedding) ఈ జంట మూడు ముళ్లతో ఒక్కటయ్యేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆలియా బ్రహ్మాస్త్ర సినిమాతో పాటు రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ చిత్రంలో నటిస్తుండగా..లవ్ రంజన్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్ తో కలిసి ఓ చిత్రంలో రణ్ బీర్ కనిపించబోతున్నారు.