Rana daggubati | ఆ రీమేక్‌లో నటించేందుకు రెడీ అవుతున్న.. రానా దగ్గుబాటి?
Rana daggubati | విలక్షణ నటనతో అటు హీరోగా, ఇటు క్యరెక్టర్ ఆర్టిస్టుగా క్షణం తీరకలేకుండా గడుపుతున్నాడు రానా దగ్గుబాటి.
Rana daggubati | విలక్షణ నటనతో అటు హీరోగా, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు రానా దగ్గుబాటి. ప్రస్తుతం ఈయన నటించిన ‘భీమ్లానాయక్’, ‘విరాట పర్వం’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మల్టీస్టారర్‌గా తెరకెక్కతున్న భీమ్లానాయక్ చిత్రాన్ని సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందించాడు. మలయాళంలో హిట్టయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.ఇక ఈ చిత్రాన్ని ఎప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇక విరాటపర్వం చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల అవుతుందంటూ గతం నుండే వార్తలు వస్తున్నాయి. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. ఈ క్రమంలో రానా ఓ తమిళ రీమేక్ చిత్రంలో నటించేందుకు ముస్తాబవుతున్నట్లు సమాచారం.
లేటెస్ట్గా తమిళంలో హిట్టయిన ‘మానాడు’ చిత్రంలో హీరోగా రానా నటించనున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదరుచూస్తున్న తమిళ స్టార్ శింబుకు మానాడు మంచి కంబ్యాక్ ఇచ్చింది. గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ చిత్రం మొదటి షోనుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లను రాబట్టింది.ఇక ఇందులో SJ సూర్య పండించిన విలనిజంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్ర రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసింది. ఇక ఇందులో హీరో పాత్రకోసం పలువురిని అనుకున్న చివరకు రానానే కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తుంది. ప్రతినాయకుడి పాత్రలో SJ సూర్య నటిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. తమిళంలో దర్శకత్వం వహించిన వెంకట్‌ప్రభునే తెలుగు వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

