1854-1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పీరియాడిక్ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. వివాహానంతరం అగ్ర కథానాయకుడు దేవరకొండ విజయ్, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా చిత్రం విడుదల తేదీని గురువారం మేకర్స్ ప్రకటించారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 16న ‘రణబాలి’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో విజయ్ దేవరకొండ చేతిలో కత్తితో ఫెరోషియస్‌గా కనిపిస్తున్నారు. ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: ప్రమోద్ తమ్మినేని, కెమెరా: నీరవ్ షా, జిష్ణు భట్టాచర్జీ, సంగీతం: అజయ్-అతుల్, సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్.