సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు, ఆయన కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలిచిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీకృష్ణ మళ్ల దర్శకుడు. మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా నటుడు దగ్గుబాటి రానా విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘గ్లింప్స్‌కు మంచి స్పందన వస్తోంది. మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్ల ఈ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు.