క్లైమాక్స్ లేకుండా సినిమా ఏంట్రా బాబు.. రానా సినిమాపై ప్రేక్షకులు ఫైర్..

Rana 1945 movie | ప్రతి హీరో కెరీర్లో కొన్ని సినిమాలు చాలా సతాయిస్తూ ఉంటాయి. ఎంత ప్రయత్నించినా కూడా విడుదల కావు. చివరకు ఆ సినిమాలను నిర్మాతల ఇష్టానికే వదిలేసి పక్కకు తప్పుకుంటారు. రానా దగ్గుబాటి ( Rana Daggubati ) కెరీర్లో కూడా అలాంటి ఒక సినిమా ఉంది. అదే 1945. బాహుబలి సినిమా చేసే సమయంలో రానా ఈ సినిమాకు కమిట్ అయ్యాడు. కొత్త దర్శకుడు సత్య శివ ఈ సినిమాను తెరకెక్కించాడు. నాలుగేండ్ల క్రితం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ అనుకోకుండా వివాదాల బారిన పడింది.
బ్రిటీష్ పాలన నేపథ్యంలో 1945 సినిమాను తెరకెక్కించాడు సత్య శివ. అయితే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయిన తర్వాత రానా, నిర్మాతల మధ్య గొడవ జరిగింది. అందుకే ‘ఈ సినిమాతో నాకు ఎటువంటి సంబంధం లేదు’ అని ఇది వరకే తన సోషల్ మీడియాలో తెలియజేశాడు రానా. పూర్తి కాని సినిమాను ఎలా విడుదల చేస్తారో నాకు కూడా అర్థం కావడం లేదు అంటూ రానా ఇది వరకే చెప్పాడు. కేవలం తన మార్కెట్ క్యాష్ చేసుకోవడానికి మాత్రమే ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారని తెలిపాడు. ఇదే విషయాన్ని అప్పుడు ప్రేక్షకులకు చెప్పి ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయకండి అంటూ సోషల్ మీడియాలో తెలియజేశాడు రానా. ఆ సమయంలోనే ‘షూటింగ్ పూర్తయ్యిందో లేదో డిసైడ్ చెయ్యాల్సింది దర్శకుడు’ అంటూ నిర్మాత కూడా రానాకి కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత 1945 సినిమా నుంచి తప్పుకున్నాడు రానా. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ పుణ్యమా అని ఇప్పుడు థియేటర్స్ లోకి వచ్చింది 1945 సినిమా. ఇది చూసిన తర్వాత రానా ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం అవుతుంది.
1945 సినిమాలో హీరో రానాతో పాటు రెజీనా ( Regina ), నాజర్, సత్యరాజ్, సప్తగిరి లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. అయితే దర్శకుడు సత్య శివ మాత్రం మంచి అవకాశం అసలు ఉపయోగించుకోలేకపోయాడు. సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి సీన్ పడలేదు అంటే ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటి అంటే ఈ సినిమాకు క్లైమాక్స్ లేదు. అంటే రానా చెప్పింది నిజమే సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే విడుదల చేశారు. 2 గంటల 2 నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమా కనీసం వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఏదేమైనా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయొద్దు అని రానా చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయని అంటున్నారు విశ్లేషకులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rana | పెండ్లి తర్వాత నేనేం మారలేదు.. మారిన తర్వాతే పెండ్లి చేసుకున్నా అంటున్న రానా
Rana episode promo | అప్పట్లో పూలరంగడిలా తిరిగేవాడివి..రానాతో బాలకృష్ణ..తాజా ప్రోమో అదిరింది
ఇంద్ర సినిమాకు ఒక్కో టికెట్ అంత ధరకు అమ్మారా.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన బి.గోపాల్
ఆ కుర్ర హీరో సినిమాకు అదిరిపోయే ఆఫర్.. డిజిటల్ లో షాకింగ్ రేటు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- 1945
- 1945 movie
- Rana
- rana daggubati
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

