ఆ కుర్ర హీరో సినిమాకు అదిరిపోయే ఆఫర్.. డిజిటల్ లో షాకింగ్ రేటు..

Teja Sajja Hanuman | 2-3 ఫ్లాపులు వచ్చిన తర్వాత కుర్ర హీరోల వైపు నిర్మాతలు చూడటం కష్టమే. కానీ కొందరు హీరోలు మాత్రం ఫ్లాప్‌లు వచ్చినా కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉంటారు. ఆ జాబితాలోకి వచ్చే హీరో తేజ సజ్జ. 1997లో మూడేళ్ల వయసులో ప్రియరాగాలు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. దాదాపు 40కి పైగానే సినిమాల్లో నటించాడు. బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జ. ముఖ్యంగా చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమాలో చిన్నప్పటి మెగాస్టార్‌గా నటించి క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలంగాణ శకుంతలతో నేనున్నానే నాయనమ్మా అంటూ తొడ కొట్టి స్టార్ అయిపోయాడు తేజ. ఇప్పటికీ ఆ డైలాగ్ చెప్తుంటాడు తేజ. ఆ తర్వాత అదే ఊపులో చాలా సినిమాలు చేశాడు ఈ చిన్నోడు.
రెండేళ్ల కింద సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన ఓ బేబీ సినిమాతో మళ్లీ పరిచయం అయ్యాడు తేజ. అందులో చాలా కీలక పాత్రలో నటించాడు తేజ. మొన్నటికి మొన్న ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబి రెడ్డి సినిమాతో లీడ్ హీరోగా మారిపోయాడు. ఈ మధ్యే ఇష్క్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈ సినిమా వచ్చి పోయినట్లు కూడా ఎవరికీ తెలియదు. తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని.. కనీసం కోటి రూపాయల వసూళ్లు కూడా తీసుకురాలేకపోయింది. అయినా కూడా ఈ కుర్రాడి చేతిలో ప్రస్తుతం మరో రెండు సినిమాలున్నాయి. ఈ మధ్యే అద్భుతం సినిమాతో వచ్చాడు తేజ.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ తో పాటు మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు ఈ హీరో. ఇందులో హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఇదిలా ఉంటే తేజ రెమ్యునరేషన్ కు రెక్కలొచ్చినట్లు తెలుస్తుంది. హనుమాన్ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ తో పాటు డిజిటల్, శాటిలైట్ అన్నీ కలిపి రూ.13 కోట్ల వరకు జరుగుతుందని అంచనా. ఈ కుర్రాడు సినిమాకు కోటి రూపాయల పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిర్మాతలు కూడా అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత సరే ఇవ్వొచ్చు అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఏదేమైనా చాలా వేగంగా ఎదుగుతున్నాడు కానీ అంతే వేగంగా కింద పడిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం తేజకు ఎంతైనా ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
ఇండస్ట్రీలో కొత్త తరం.. అందాలతో మాయ చేస్తున్న యువ హీరోయిన్లు..
Amritha Aiyer | క్యూట్ లుక్‌లో అమృత అయ్యర్..
Amritha Aiyer | గ్రీన్ చీరలో అమృత అయ్యర్ ఫొటోలు అదరహో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

