Rana episode promo | అప్పట్లో పూలరంగడిలా తిరిగేవాడివి..రానాతో బాలకృష్ణ..తాజా ప్రోమో అదిరింది
తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable with NBK) షోలో టాలీవుడ్ సెలబ్రిటీలు అతిథులుగా ఒక్కొక్కరు సందడి చేస్తూ అలరిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ (Balakrishna)హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable with NBK). తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ప్రసారమవుతున్న ఈ షోలో టాలీవుడ్ సెలబ్రిటీలు అతిథులుగా ఒక్కొక్కరు సందడి చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా ఈ షో 8వ ఎపిసోడ్లో బాహుబలి యాక్టర్ రానా (Rana Daggubati) సందడి చేశాడు. రానా స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. దాన వీర శూర కర్ణ చిత్రంలో ఎన్టీఆర్ చెప్పిన ఏమంటివి ఏమంటివి అంటూ వచ్చే పాపులర్ డైలాగ్ చెబుతుండగా..మధ్యలో బాలకృష్ణ కూడా రానాతో కలిసి డైలాగ్ చెప్పాడు.
నా టాక్ షోలో బెస్ట్ ఎపిసోడ్లో ప్రతీ సీజన్ మీదే సార్ అంటూ రానా ఎంట్రీతోనే చెప్పగా..కొత్తగా అంటావేంటయ్యా బాలకృష్ణ అంటేనే బెస్ట్ అని బాలయ్య చెప్పడంతో గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేయడం చూడొచ్చు. ఫస్ట్ టైం బాలకృష్ణ టాక్ షో చేస్తున్నాడంటే నీకెమనిపించింది అని రానాను బాలయ్య అడుగగా..మేమందరం మామూలు ట్రైన్లలో వెళ్తుంటే మీరేమో బుల్లెట్ ట్రైన్ తీసుకొని వచ్చారని రానా అంటున్నాడు. లాక్ డౌన్ టైంలో వ్యాక్సిన్ వస్తుందనుకుంటే నీ పెళ్లి న్యూస్ వచ్చిందేంటయ్యా బాబు ఏంటీ అంత సడెన్‌గా అని బాలయ్య అడిగితే..చేసిందన్నీ ఉన్నాయి. చేయందొకటి ఉందంటే పెళ్లొకటే అందుకే చేసుకున్నా అని రిప్టై ఇచ్చాడు రానా.
అప్పట్లో పూలరంగడిలా తిరిగేవాడివి..పెళ్లయ్యాక బ్యాలెన్స్ వచ్చేసింది..అంటూ రానాపై బాలయ్య ఫన్నీ సెటైర్లను ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం ప్రోమోనే ఇలా ఉంటే ఇక ఫుల్ ఎపిసోడ్ ఏ రేంజ్లో ఉందో జనవరి 7న రాత్రి 8 గంటలకు ఆహాలో ప్రసారమయే ఫుల్ ఎపిసోడ్‌తో తెలిసిపోనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

