Jr.NTR | వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కాబోతున్న దేవరపై నందమూరి ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ లవర్స్ అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై జనాల్లో మాములు అంచనాలు లేవు. ఆ మధ్య విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు . రగ్గుడ్ లుక్‌లో, రక్తపు మరకలతో ఉన్న తారక్ పోస్టర్ అభిమానులనే కాదు, సినీ లవర్స్‌ను సైతం ఉర్రూతలూగించింది. అసలు సిసలైన మాస్ అవతారంలో తారక్‌ను చూపించాడంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాలపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆచార్య వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత తారక్‌తో సినిమా చేస్తుండటంతో కొందరి అభిమానుల టెన్షన్ అంతా ఇంతా కాదు. అయితే వాళ్ల టెన్షన్ ఒక్క పోస్టర్‌తో పటా పంచలైంది.
పోస్టరే ఈ రేంజ్లో దింపితే.. సినిమా ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుందోనన్న ఊహే ఒక హై ఇస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అత్తగా రమ్యకృష్ణ కనిపించనుందని తెలుస్తుంది. ఇటీవలే జౌలర్తో ఓ రేంజ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న నీలాంబరి.. తారక్‌కు అత్తగా నటించబోతుందన్న వార్త రావడంతో అభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. పైగా వీళ్లద్దరూ పద్దెనిమిదేళ్ల కిందటే నా అల్లుడు సినిమాలో అత్త, అల్లుడుగా చేశారు. అప్పుడే వీళ్ల కాంబోకు ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబో ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రధానంగా సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందట. ఈ సినిమాలో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంది. ఇక ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ దేవరతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.