Bigg Boss9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఏడో వారం ఎలిమినేషన్ విషయంలో ప్రేక్షకుల అంచనాలు నిజమయ్యాయి. ఐదో వారం వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన రమ్య మోక్ష ఈ వారం షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. రెండు వారాలే హౌజ్‌లో ఉండి బయటకు రావాల్సి రావడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. ‘చిట్టి పికిల్స్’ ద్వారా పాపులర్ అయిన రమ్య మోక్ష పచ్చళ్ల వివాదంతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే పాపులారిటీ ఆమెను బిగ్ బాస్ హౌజ్ వరకు తీసుకువచ్చింది. ఎలిమినేషన్ సందర్భంగా నాగార్జున అడిగిన ప్రశ్నలకు రమ్య ఓపెన్‌గా సమాధానమిచ్చింది.
కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, “అతనిలో మెచ్యూరిటీ లేదు. ఇప్పటికీ కాలేజీ కుర్రాడిలా, ఫస్ట్ లవ్‌లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తాడు” అని వ్యాఖ్యానించింది. అలాగే గౌరవ్ గురించి మాట్లాడుతూ “అతను రాక్షసుడు, ఈగో ఎక్కువ. గెలవాలనే తపన ఎక్కువగా ఉంటుంది” అని తెలిపింది. పవన్ గురించి “నీ గేమ్ నువ్వు ఆడు, ఎమోషనల్ కాకుండా ఫోకస్ పెట్టు” అని సూచించింది. బిగ్ బాంబ్ మాత్రం రీతూకి ఇచ్చి, ఈ వారం మొత్తం బాత్రూమ్లను క్లిన్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇక ఆదివారం ఎపిసోడ్ పూర్తి ఎంటర్టైన్మెంట్తో సాగింది. నాగార్జున నిర్వహించిన ఫన్ గేమ్స్, సెలబ్రిటీ ఫోటో టాస్క్‌లు హౌజ్‌లో నవ్వులు పూయించాయి. రమ్య మోక్ష, సుమన్ శెట్టి డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పవర్ అస్త్ర టాస్క్‌లో సుమన్, తనూజ, రీతూ, సంజనా, దివ్య పాల్గొన్నారు. ఇందులో ముందుగా గోల్ పూర్తి చేసిన తనూజ గోల్డెన్ అస్త్రని గెలుచుకుంది. దీంతో ఆమెకు వచ్చే వారం నుంచి ఎలిమినేషన్ నుంచి ఒకరిని సేవ్ చేసే పవర్ లభించింది. మరోవైపు కెప్టెన్ ఇమ్మాన్యుయెల్ నిర్ణయం ప్రకారం ఈ వారం సంజనాకు “అన్విజబుల్ పర్సన్” పనిష్మెంట్ విధించారు. అంటే ఈ వారం మొత్తం ఆమె ఎవరితోనూ మాట్లాడకూడదు, హౌజ్‌లో లేనట్టుగా వ్యవహరించాలి. మొత్తానికి రమ్య మోక్ష ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ హౌజ్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి వచ్చే వారం టాస్క్‌లు, గోల్డెన్ అస్త్ర ప్రభావం, మరియు సంజనాపై పడబోయే ఒత్తిడిపైనే ఉంది.