సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ హీరోయిన్గా పరిచయం అవుతున్న చిత్రం ‘క్వీన్’. సామాజికాంశాలతో ముడిపడ్డ ఈ లేడీ ఓరియెంటెడ్ డ్రామాకి రతన్ రిషి దర్శకుడు. వన్ సర్కిల్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో ముఖ్యమంత్రి లక్ష్మీప్రణతిగా సీనియర్ నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూట్లో ఆమె జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. నిజజీవిత పాత్రల స్ఫూర్తితో, వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఫిక్షనల్ స్టోరీ ఇదని, సమాజంతో ముడిపడ్డ ఓ ఆసక్తికరమైన ప్రేమకథను ఇందులో చూస్తారని మేకర్స్ తెలిపారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సాయికుమార్, తనికెళ్ల భరణి, అజయ్‌ఘోష్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: బాల ఎన్. సరస్వతి, సంగీతం: భరత్ ఎం.