Ramgopal Verma | ఆ భయంతోనే పవన్‌కళ్యాణ్ పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు: ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్
Ramgopal Verma | ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. ఆ పార్టీకి కేవలం 24 సీట్లు కేటాయించడంపై సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఒక్క సీటు కిందికైనా, ఒక్క సీటు మీదికైనా పవన్‌కళ్యాణ్ మీద ట్రోల్స్ ఖాయమనే భయంతోనే పవన్ పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.
Ramgopal Verma: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. ఆ పార్టీకి కేవలం 24 సీట్లు కేటాయించడంపై సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఒక్క సీటు కిందికైనా, ఒక్క సీటు మీదికైనా పవన్‌కళ్యాణ్ మీద ట్రోల్స్ ఖాయమనే భయంతోనే పవన్ పార్టీకి 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.
పొత్తులో భాగంగా జనసేనకు టీడీపీ 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలు కేటాయించింది. శనివారం ఉదయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రెస్‌మీట్ పెట్టి ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారో వెల్లడించారు. ఈ నేపథ్యంలో జనసేనకు కేవలం 24 సీట్లే కేటాయించడంపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. జనం ట్రోల్ చేస్తారనే భయంతోనే పవన్ పార్టీకి 24 సీట్లు కేటాయించారని ఎద్దేవా చేశారు. ‘23 సీట్లిస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు. 25 సీట్లిస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారని ట్రోల్ చేస్తారు. అందుకే మధ్యే మార్గంగా 24 సీట్లు ఇచ్చారు’ అని ఆర్జీవీ సెటైర్లు వేశారు.
జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన లేకుంటే టీడీపీ గెలువదంటూ గతంలో చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకోవడం అంటే జనసేన కార్యకర్తలను అవమానించడమేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పదేళ్ల చరిత్ర ఉండి, గత ఎన్నికల్లో 130 స్థానాల్లో పోటీ చేసి, ఇప్పుడు కేవలం 24 స్థానాలకే పరిమితం కావడం అంటే.. పవన్ చంద్రబాబు ట్రాప్‌లో పడ్డాడని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు….25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు…అందుకే మధ్యే మార్గంగా 24 😳
— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

