Ram gopal varma | రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటాడో తెలిసిందే. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పై తన స్టైల్లో స్పందిస్తుంటాడు. తాజాగా ఏపీ సీఎం జగన్ దగ్గర టాలీవుడ్ సినీప్రముఖులు జరిపిన చర్చలపై ఆర్జీవీ తన స్టైల్లో స్పందించాడు. ఏపీ సినిమా టికెట్లకు సంబంధించి చిరంజీవి, ప్రభాస్, మహేష్‌బాబు, కొరటాల శివ, రాజమౌళి, ఆర్.నారాయణమూర్తీ పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎంతో చర్చించారు. ఈ చర్చల అంశంపై ఆర్జీవీ తన ట్విట్టర్లో స్పందించాడు.
ఏపీ ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ మధ్య ఉద్రిక్తత తొలగిపోయింది. చిత్ర పరిశ్రమ సంతోషకర ప్రయాణానికి పునాది వేసిన ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు. సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్ల ఈ మీటింగ్ జరిగినప్పటికీ, ఒమెగా స్టార్ వైఎస్ జగన్ వారిని ఆశీర్వదించినందుకు నేను సంతోషిస్తున్నాను. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి ముందు ఆర్జీవీ ఓ మెగా అభిమానిగా ఈ మెగా బెగ్గింగ్‌ను చూసి చాలా హర్ట్ అయ్యా అని పోస్ట్ వేసి వెంటనే డిలీట్ చేశాడు.
Though it happened because of SUPER, MEGA, BAHUBALI LEVEL BEGGING , I am glad that the OMEGA STAR @ysjagan has blessed them.. I tremendously appreciate the SUPER,MEGA,BAHUBALIni minchina MAHABAL @ysjagan 🙏 https://t.co/3oWTPGlG5u
— Ram Gopal Varma (@RGVzoomin) February 11, 2022