Ramayana OTT | ఓటీటీలో ‘రామాయణ’ రెండు వెర్షన్లు వస్తాయా ..సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!
Ramayana OTT | బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో దూసుకెళ్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ గురించి మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ విడుదల గురించి జోరుగా చర్చ నడుస్తుంది.
Ramayana OTT | బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో దూసుకెళ్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ గురించి మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ విడుదల గురించి జోరుగా చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో ఈ సినిమా నుంచి కొన్ని వీడియో క్లిప్స్ వైరల్ అవుతుండటంతో ఓటీటీ వెర్షన్‌పై ఆసక్తికరమైన ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్ వెర్షన్లో కనిపించని ఓ కీలక సన్నివేశం అంతర్జాతీయ ఇంగ్లీష్ వెర్షన్లో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఓటీటీలో ప్రేక్షకులకు రెండు వెర్షన్లు అందుబాటులోకి వస్తాయా? లేక ఒకే వెర్షన్‌ను పలు భాషల్లో స్ట్రీమింగ్ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
‘రామాయణ’ సినిమాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్‌లో లక్ష్మణుడు గాయపడిన స్థితిలో సీతాదేవితో కలిసి అసురుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో తోడేళ్లను పోలిన కొన్ని భయంకరమైన జీవులు వారిని వెంబడిస్తుంటాయి. అవి దాడి చేయబోతున్న సమయంలో శ్రీరాముడు అక్కడికి చేరుకుని సీత, లక్ష్మణులను రక్షించే సన్నివేశం కనిపిస్తుంది. ఈ సీన్ అంతర్జాతీయ ఇంగ్లీష్ వెర్షన్లో భాగంగా ఉందని, అయితే భారతీయ ప్రేక్షకుల కోసం విడుదల చేసిన వెర్షన్లో మాత్రం కనిపించలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో దర్శక నిర్మాతలు ఈ సన్నివేశాన్ని ఇండియన్ వెర్షన్ నుంచి ఎందుకు తొలగించారు? అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా మరో వెర్షన్‌ను రూపొందించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ అదనపు సన్నివేశం బయటకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి సినిమా ఓటీటీ విడుదలపై పడింది. థియేటర్లలో విడుదలైన భారతీయ వెర్షన్‌కు భిన్నంగా అంతర్జాతీయ వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులోకి వస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జియోహాట్‌స్టార్‌కు సంబంధించినవిగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్లాట్ఫామ్లో రెండు వెర్షన్లను అందిస్తారా? అనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ రెండు వెర్షన్లను విడుదల చేస్తే ప్రేక్షకులకు తమకు నచ్చిన వెర్షన్‌ను ఎంచుకుని చూసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఒకే వెర్షన్‌ను వివిధ భాషల్లో అందుబాటులోకి తీసుకువస్తే అంతర్జాతీయ వెర్షన్‌లోని అదనపు సన్నివేశాలను భారతీయ ప్రేక్షకులు చూడలేకపోవచ్చు. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఓటీటీ విడుదల సమయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana OTT | ఓటీటీలో ‘రామాయణ’ రెండు వెర్షన్లు వస్తాయా ..సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!
Samantha | సమంత బేబీ బంప్ ఫోటో వైరల్.. ఇదే నా మెటర్నిటి షూట్ అంటూ క్రేజీ క్యాప్షన్.. !
Nvidia | సీఈఓపై దర్యాప్తు ఎఫెక్ట్.. ఒక్కరోజులో ఎన్విడియా మార్కెట్ విలువ రూ.17 లక్షల కోట్లు ఆవిరి!
Pawan – Anna | పవన్ కళ్యాణ్ -అన్నా కొణిదెల విడాకుల వార్తలతో ఫ్యాన్స్ హర్ట్.. పాత వీడియోలు వైరల్!
Road Accident | అదుపుతప్పి బైకును ఢీకొట్టిన కారు.. రెండు వాహనాలు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

