Pawan – Anna | పవన్ కళ్యాణ్ -అన్నా కొణిదెల విడాకుల వార్తలతో ఫ్యాన్స్ హర్ట్.. పాత వీడియోలు వైరల్!
Pawan - Anna | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు టాలీవుడ్‌లోనూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు, రాజకీయాలే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంటాయి.
Pawan – Anna | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు టాలీవుడ్‌లోనూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు, రాజకీయాలే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజినోవా) విడాకులు తీసుకున్నామంటూ ప్రకటించారు. ఈ వార్తలు అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాయి. అభిమానులు మాత్రం ఈ వార్తలు నిజం కాకపోతే బాగుండు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల మధ్య అనుబంధానికి సంబంధించిన పాత వీడియోలు ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చోటుచేసుకున్న ఓ సంఘటనను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి తల్లి, అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో అన్నా కొణిదెల భర్త చెప్పులను చేతులతో పట్టుకున్న దృశ్యం అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియోలో అన్నా చూపించిన ఆప్యాయత, భర్తపై ఆమెకు ఉన్న గౌరవాన్ని అభిమానులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పుడు విడాకుల వార్తలు తెరపైకి రావడంతో అదే వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట గురించి ఇలాంటి వార్తలు వినాల్సి రావడం బాధాకరమని కామెంట్స్ చేస్తున్నారు.
అన్నా లెజినోవా తెలుగు సంప్రదాయాలు, హిందూ ఆచారాల పట్ల గౌరవం చూపించడం కూడా గతంలో అభిమానులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తన పేరును అన్నా లెజినోవా నుంచి ‘అన్నా కొణిదెల’గా మార్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అంతేకాకుండా తన కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తలనీలాలు సమర్పించుకోవడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ ఘటనలను గుర్తుచేసుకుంటున్న పవన్ అభిమానులు, అన్నా తన కుటుంబం పట్ల ఎంతటి అనుబంధాన్ని చూపించారో అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే విడాకుల వార్తల మధ్య అన్నా కొణిదెల ఇన్స్టాగ్రామ్ ఖాతా కనిపించడం లేదంటూ మరో ప్రచారం మొదలైంది. ఆమె తన అకౌంట్‌ను డిలీట్ చేశారా? లేక తాత్కాలికంగా డీయాక్టివేట్ చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan – Anna | పవన్ కళ్యాణ్ -అన్నా కొణిదెల విడాకుల వార్తలతో ఫ్యాన్స్ హర్ట్.. పాత వీడియోలు వైరల్!
Road Accident | అదుపుతప్పి బైకును ఢీకొట్టిన కారు.. రెండు వాహనాలు ధ్వంసం
IND vs NZ | భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేకు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దవుతుందా!
Bellamkonda Sreenivas | ‘హైందవ’కు అదిరిపోయే బిజినెస్.. విడుదలకు ముందే రూ.32 కోట్లు,నిర్మాతలకు భారీ ఊరట!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ముదిరిన గొడవలు.. సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్ధం, తనను తాను కొట్టుకున్న నీతూ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

