S.S.Rajamouli | రాజమౌళి తీసిన సినిమాల్లో.. ఆయన భార్యకు నచ్చని సినిమా అదేనట..!
సినిమాల యందు రాజమౌళి సినిమాలు వేరయా. రాజమౌళి సినిమాలను చెక్కుతుంటాడు. అందుకే ఆయన దర్శకత్వం వహించిన ప్రతీ సినిమా ఒక అందమైన శిల్పంలా కనిపిస్తుంది. ఇప్పటివరకు రాజమౌళి 12 సినిమాలను తెరకెక్కించాడు.
Rama Rajamoli | సినిమాల యందు రాజమౌళి సినిమాలు వేరయా. రాజమౌళి సినిమాలను చెక్కుతుంటాడు. అందుకే ఆయన దర్శకత్వం వహించిన ప్రతీ సినిమా ఒక అందమైన శిల్పంలా కనిపిస్తుంది. ఇప్పటివరకు రాజమౌళి 12 సినిమాలను తెరకెక్కించాడు. ఆ పన్నెండు ఒకదానికి మించి మరొకటి విజయాలు సాధించాయి. హీరోలతో సంబంధంలేకుండా పోస్టర్‌పైన రాజమౌళి పేరు కనబడితే చాలు థియేటర్లకు పరుగులు తీసే ప్రేక్షకులున్నారు. ఆయన సినిమాల్లో కథలు అంత గొప్పగా ఉండకపోవచ్చు.. కానీ ఆయన విజన్, తీసే విధానం సామన్య ప్రేక్షకుడి ఊహకు కూడా అందవు. ఇక ఆయన సినిమాల్లో మనకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం అంటే చెప్పగలం.. కానీ, ఏ సినిమా ఇష్టం లేదు అంటే చెప్పలేం. ఎందుకంటే ఈయన సినిమాలను ఇష్టపడని వారుండరు.
అయితే తాజాగా రాజమౌళి భార్య రమా రాజమౌళి.. తన భర్త దర్శకత్వం వహించిన సినిమాల్లో ఒక సినిమ ఆంటే అస్సలు ఇష్టం ఉండదట. ఇంతకీ ఆ సినిమా ఏది అనుకుంటున్నారా? ఆ సినిమా మరేదో కాదు ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’. ఈ సినిమా అంటే రమాకు ఇష్టం ఉండదని తాజాగా ఓ ఇంటర్వూలో తనే స్వయంగా చెప్పింది. కారణాలు చెప్పలేను కానీ యమదొంగ సినిమాకు రాజమౌళి డైరెక్షన్ తనకు నచ్చలేదు అని రమా చెప్పింది. ఆ సినిమాలో తారక్ అద్భుతంగా నటించాడని, ఎన్టీఆర్ వల్లే ఆ సినిమా హిట్టయిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా రమా రాజమౌళి తన భర్త సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తుంది.
‘బాహుబలి’తో తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’తో ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాడు. హాలీవుడ్ ప్రేక్షకులే కాదు, హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి దర్శకత్వం ప్రతిభకు సలాం కొడుతున్నారు. జేమ్స్ కామెరూన్, స్కాట్ డెర్రిక్సన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం ఆర్ఆర్ఆర్ గురించి గొప్పగా వర్ణించారు.
ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ అవార్డు ఈ పాటకు రావడంపై ఇండియన్ సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనితో పాటుగా క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్‌లో భాగంగా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ సాంగ్(నాటు నాటు) అవార్డులను కూడా గెలుచుకుంది. కాగా నాటు నాటు పాట ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

