The Warriorr Latest Promo | ఉస్తాద్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది వారియర్’. ఎన్.లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపిస్తుంది. ఈ చిత్రం రామ్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ తీసుకువచ్చింది. ఈ చిత్రం విడుదల రోజు వర్షాలు జోరుమీదున్న డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటివరకు ఈ చిత్రం దాదాపు రూ.15 కోట్ల వరకు వసూళ్ళను రాబట్టంది. అయితే ఫుల్ రన్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం మరో 25కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. కాగా టిక్కెట్ రేట్ల బాగా ఉండటం ఈ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుండి ప్రోమోను విడుదల చేశారు.
ఈ ప్రోమోలో కృతి ‘బయటకు వెళ్దామా’ అని అడుగగా.. దానికి రామ్ నవ్వుతూ ‘ఎక్కడికి కాఫీ షాప్కేనా’ అంటాడు. అంతలో కృతిశెట్టి ‘ఏ అమ్మాయిలు అడిగితే కాఫీ షాప్కేనా.. మందేద్దామా’ అంటుంది. పది సెకన్ల నిడివిగల ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ పోతినేని పోలీస్ అధికారిగా, డాక్టర్‌గా రెండు పాత్రల్లో నటించాడు. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. గురు పాత్రలో ఆది విలక్షణ నటనను కనబరిచాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
Satya & Whistle Mahalakshmi's Onscreen Magical Chemistry is Pure Bliss 🤩❤️
🎟️https://t.co/dyBF2uJuVF
🎟️https://t.co/gt9CFtPDzo#WarriorrRampage #TheWarriorr ❤️🔥@ramsayz @AadhiOfficial @dirlingusamy @ThisisDSP @IamKrithiShetty @SS_Screens @adityamusic @masterpieceoffl pic.twitter.com/EPof96Bv62— Srinivasaa Silver Screen (@SS_Screens) July 17, 2022
Read Also:
Liger Movie | విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?
RRR Movie | ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై ‘డాక్టర్ స్ట్రేంజ్’ దర్శకుడి ప్రశంసలు
Kamal Haasan | ‘కబాలి’ దర్శకుడితో కమల్‌హాసన్ నెక్స్ట్ సినిమా
Kiran Abbavaram | బాలీవుడ్ స్టార్ హీరోతో పోటీ పడనున్న కిరణ్ అబ్బవరం?