RAPO 23 | రూ.100 కోట్లతో రాపో23.. రామ్ పోతినేని పాన్ ఇండియా ప్లాన్, టాప్ టీమ్ ఫిక్స్!
Ram Pothineni | యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా RAPO23 చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్నారు.
RAPO 23 | యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా RAPO23 చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్నారు. రామ్ ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ఈ ప్రాజెక్ట్‌ను అత్యున్నత నిర్మాణ విలువలతో, భారీ స్కేల్లో ప్లాన్ చేశారు. ఇప్పటివరకు రామ్ కెరీర్లో చేయని విధంగా యాక్షన్, ఎమోషన్, గ్రాండియర్ కలబోసిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కోసం ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలుస్తుంది. దీంతో టాలీవుడ్లోనే అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటిగా RAPO23 నిలవనుంది. బడ్జెట్‌కే తగ్గట్టుగా ఈ సినిమా కోసం ఇండియన్ సినిమాలోని టాప్ టెక్నీషియన్స్‌ను రంగంలోకి దించబోతున్నారు. నేషనల్ అవార్డు గ్రహీత, స్టార్ సినిమాటోగ్రాఫర్ తిరు ఈ చిత్రానికి విజువల్స్ అందిస్తుండగా, హాలీవుడ్ రేంజ్ యాక్షన్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన పీటర్ హెయిన్ హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే పీటర్ హెయిన్ టీమ్‌తో భారీ యాక్షన్ బ్లాక్స్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.
ఇక ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్. ప్రకాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లలో భారీ సెట్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఒక సిటీ సెట్‌తో పాటు కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ కోసం స్పెషల్ సెట్స్ వేస్తున్నారు. కళ్లు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్, రిచ్ ప్రొడక్షన్ డిజైన్, వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ కలయికలో వస్తున్న RAPO23 రామ్ పోతినేని కెరీర్లో గేమ్ ఛేంజర్ అవుతుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

