హీరో రామ్‌కి ఇప్పుడు విజయం చాలా అవసరం. ప్రస్తుతం ఆయన మహేష్‌బాబు.పి దర్శకత్వంలో నటిస్తున్నారు. ‘మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో మహేశ్‌బాబుకి దర్శకుడిగా మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఆయన ద్వితీయవిఘ్నాన్ని అధిగమించేందుకు శాయశక్తులా శ్రమిస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలావుంటే.. ‘క’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శక ద్వయం సుజిత్-సందీప్‌లు ఇటీవలే రామ్‌కి ఓ కథ వినిపించారట. ఇది డిఫరెంట్ స్టోరీ అని సమాచారం. కథ నచ్చడంతో రామ్ కూడా ఓకే చేప్పేశాడని తెలుస్తున్నది. ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తవ్వగానే, సుజిత్-సందీప్‌ల సినిమాను పట్టాలెక్కించేస్తారట రామ్. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం.