Ram Pothineni | ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ పోతినేని తనలోని మాస్ కోణాని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ను ఏర్పరుచుకున్న రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూర్తిగా మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత రామ్ కథల ఎంపిక పూర్తిగా మారింది. మాస్ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో మాస్ కథల వైపే మొగ్గుచూపుతున్నాడు. గతేడాదిలో వచ్చిన ‘రెడ్’.. ఇటీవలే వచ్చిన ‘ది వారియర్’ చిత్రంలోనూ మాస్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలాగున్నా.. మాస్ ఆడియోన్స్‌లో మాత్రం మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం రామ్, బోయపాటి శ్రీనుతో అవుట్ అండ్ అవుడ్ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. చాక్లెట్ బాయ్ రామ్‌ను.. బోయపాటి యాక్షన్ బాయ్‌గా ఎలా చూపిస్తాడో అని ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ఇదిలా ఉంటే తాజాగా రామ్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రామ్ తాజాగా హైదరాబాద్ ఏయిర్‌పోర్ట్‌లో రగ్గుడ్ లుక్‌లో కనిపించాడు. జుట్టు మొత్తం పైకి లేపి.. నెరిసిన గడ్డంతో డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్‌తో ఫుల్ మాస్‌లుక్‌లో ఉన్నాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరీ ఈ లుక్ బోయపాటి సినిమా కోసమా.. లేదంటే సరదాగా కొత్తగా ఉంటుందని అలాంటి లుక్ ట్రై చేశాడా అనే దానిపై క్లారిటీ రావాల్సిఉంది.
Voaah 💥 #Rapo looks 👌👌#rampothineni@ramsayz pic.twitter.com/zlm86kG1CY
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) February 14, 2023