Double Ismart | రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రాబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 15న రామ్ పుట్టిన రోజుని పురస్కరించుకొని టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రామ్ ఫేస్ మాస్క్ ధరించి పవర్ఫుల్ మాస్ లుక్‌తో కనిపిస్తున్నారు.
‘ప్రస్తుతం ప్రధాన తారాగణం పాల్గొనగా ముంబయిలో చిత్రీకరణ జరుపుతున్నాం. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు డబుల్ యాక్షన్, డబుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. రామ్ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాయి కె నాయుడు, జియాని జియాన్నెలి, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మికౌర్, రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్.