ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వివాదం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురు తెలుగు సినీ సెలబ్రిటీలతో పాటు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఈ వివాదంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు.
రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం శారీ. యథార్థ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో ఆరాధ్య దేవి కథానాయికగా నటిస్తుంది. వర్మ ఈ సినిమాకు కథను అందించగా.. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించాడు. ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 04న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహించింది చిత్రయూనిట్.
ఈ వేడుకలో ఆర్జీవీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి మాట్లాడుతూ.. నేను బెట్టింగ్ యాప్స్ గురించి తెలియదు. ఎందుకంటే ఇంతకుమందు కూడా నేను ఎటువంటి యాడ్లలో నటించలేదు. అలాగే నా సోషల్ మీడియా అకౌంట్స్‌ని కూడా ప్రమోషన్‌కి వాడలేదు. ఒకవేళ నేను ప్రమోట్ చేయాలి అనుకుంటే వోడ్కానే ప్రమోట్ చేస్తా.. బెట్టింగ్ యాప్స్ కాదు. ఎందుకంటే కొన్ని ప్రమోట్ చేయాలంటే అవి లీగలా కాదా అనేది ఎవరికి తెలిసి ఉండదు. ప్రభుత్వం ఇవి లీగల్ అని ప్రజలకు అవగాహన కల్పించాలి. స్టార్ నటులను తీసుకుంటే బెట్టింగ్ యాప్స్ కాకుండా చాలా బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉంటారు. అవి లీగల్ అని ఎలా తెలుస్తది. సడన్‌గా ఒకరోజు వచ్చి అవి ప్రమోట్ చేయడం నేరం అంటారు. ఇలాంటివి చేసే ముందు ప్రభుత్వం అవెర్నెస్ క్రియేట్ చేయాలంటూ ఆర్జీవీ చెప్పుకోచ్చాడు.