Athamma’s Kitchen | ప్రముఖ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌కు ఓ ప్రత్యేక బహుమతిని అందజేసింది. రామ్ చరణ్ తల్లి సురేఖ కొణిదెల ఫుడ్ బిజినెస్‌లోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే. గతేడాది ‘అత్తమ్మాస్ కిచెన్’ పేరుతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్‌లోకి సురేఖ ఎంట్రీ ఇచ్చింది. సురేఖకు తెలిసిన సంప్రదాయ వంటకాలతో పాటు పచ్చళ్లను ‘అత్తమ్మాస్ కిచెన్’ అందిస్తుంది. అయితే ‘అత్తమ్మాస్ కిచెన్’కు చెందిన గిప్ట్ హ్యాంపర్‌ను జాన్వీకి అందించింది ఉపాసన. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మరోవైపు ఈ సంఘటన జూబ్లీ హిల్స్‌లోని రామ్ చరణ్ నివాసంలో జరిగింది.
జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి ‘RC16’ అనే ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌తో ‘దేవర’తో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాతో బిజీగా గడుపుతుంది. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ విరామం దొరికిన సమయంలో జాన్వీ, రామ్ చరణ్ ఇంటికి వెళ్లగా, అక్కడ ఉపాసనతో కలిసి కొంత సమయం గడిపింది. ఈ క్రమంలోనే జాన్వీకి ఉపాసన ‘అత్తమ్మాస్ కిచెన్’ గిప్ట్ హ్యాంపర్‌ను ఇచ్చినట్లు తెలుస్తుంది.