రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రానికి ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం హీరో రామ్‌చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
సామాజిక ఇతివృత్తాలను భారీ కమర్షియల్ హంగులతో జనరంజకంగా తీర్చిదిద్దడంలో దిట్ట దర్శకుడు శంకర్. ఈ సినిమా కూడా రాజకీయ, సామాజిక అంశాల కలబోతగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు.
కియారా అద్వాణీ, అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్‌చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్. తిరుణావుక్కరసు, సంగీతం: తమన్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజ్, ఆర్ట్: అవినాష్ కొల్ల, యాక్షన్: అన్బరివు, రచయితలు: ఎస్.యు.వెంకటేశన్, ఫర్షద్ సామ్జీ, వివేక్, దర్శకత్వం: శంకర్.