Ram Charan | రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’ సంక్రాంతికి విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌ని కూడా నిర్మాత దిల్‌రాజు మొదలుపెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన తన వర్క్‌నంతా రామ్‌చరణ్ పూర్తి చేసుకున్నారు. ఇక ప్రమోషన్స్‌కి కొన్ని రోజులు కేటాయిస్తే సరిపోతుంది. ప్రస్తుతం రామ్‌చరణ్ దృష్టి అంతా బుచ్చిబాబు సాన సినిమాపైనే. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే స్పోర్ట్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నది. ఇందులో చరణ్ మల్లయుద్ధ వీరుడిగా కనిపిస్తాడని సమాచారం.
మల్లయుద్ధం అనగానే గుర్తొచ్చే పేరు కోడి రామమూర్తి. ఉత్తరాంధ్రకు చెందిన ఈ యోధుడి జీవితమే ప్రేరణగా బుచ్చిబాబు కథ రాసుకున్నారట. జాన్వీ కపూర్ కథానాయికగా నటించనున్నది. ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో ఇప్పటికే మూడు పాటలను రికార్డ్ చేశారు. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో సినిమా సెట్స్‌కి వెళ్లనున్నట్టు సమాచారం. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.