Ramcharan – Upasana | టాలీవుడ్ స్టార్ (Tollywood Star) కపుల్స్ రామ్‌చరణ్ (Ram Charan) , ఉపాసన (Upasana) జంట ‘బేబీమూన్ ట్రిప్’ (Babymoon Trip)ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్ (Ram Charan) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికా (America) వెళ్లిన విషయం తెలిసిందే. చరణ్ (Charan)తోపాటు ఉపాసన (Upasana) సైతం యూఎస్ (Us) వెళ్లింది. అక్కడ చిత్ర ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు అంటూ చరణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను కాస్త విరామం తీసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ స్టార్.. తన జీవిత భాగస్వామి కోసం సమయాన్ని కేటాయించారు.
తాజాగా ఈ జంట అమెరికా వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టారు. షాపింగ్స్, డిన్నర్స్.. అంటూ అమెరికా అంతా తెగ తిరిగేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘బేబీమూన్’ (Babymoon) ట్రిప్ అంటూ ఈ మెగా జంట సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన మెగా అభిమానులు చరణ్-ఉపాసన జంటను చూసి తెగ ఖుషీ అవుతున్నారు.
Also Read..
Khushbu | ఆ విషయాన్ని చెప్పినందుకు నేనేమీ సిగ్గుపడట్లేదు : ఖుష్బూ
Russia – Ukraine War | యుద్ధం మిగిల్చిన విషాదం.. కనుమరుగైన మరింకా పట్టణం..!
Iran | బాలికలపై విషప్రయోగం.. విద్యార్థుల తల్లిదండ్రులు సహా పలువురి అరెస్ట్