రామ్‌చరణ్-సుకుమార్ సినిమా ప్రారంభం
రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్‌క్రియేట్ అయింది
రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్‌క్రియేట్ అయింది. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడంతో జాతీయస్థాయిలో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలేర్పడ్డాయి. ‘ఆర్సీ 17’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.
ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌నివ్వగా, టీ-సిరీస్ భూషణ్ కుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం పంచుకున్న కాన్సెప్ట్ పోస్టర్ సినిమా కథాంశంపై ఆసక్తినిరేకెత్తిస్తున్నది. నెమలి పింఛం వెనక రామ్‌చరణ్ ముఖం కనిపించేలా ఈ పోస్టర్‌ను తీర్చిదిద్దారు. ఈ కథలో కృష్ణుడి ఎలిమెంట్ కీలకంగా ఉండబోతున్నదని పోస్టర్‌ను చూస్తే అర్థమవుతున్నది. ‘యు కెన్ ఇమాజిన్’ అనే క్యాప్షన్ కూడా ఆసక్తిని కలిగిస్తున్నది. ఈ సినిమాలో రామ్‌చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తారని, ఇదొక విభిన్నమైన కథాంశమని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్, రచన-దర్శకత్వం: సుకుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

