రామ్‌చరణ్ గత కొద్ది వారాలుగా జిమ్‌కే అధిక సమయాన్ని కేటాయించారు. సాలిడ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి పెట్టి బీస్ట్మోడ్లోకి మారిపోయారు. కంటిన్యూయస్‌గా వర్కవుట్స్ చేస్తూ స్ట్రాంగ్ రగ్గ్డ్ లుక్‌లోకి మారిపోయారు. ఇప్పుడీ నెవర్ బిఫోర్ అవతార్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. రామ్‌చరణ్ చేసిన ఈ కసరత్తులన్నీ ‘పెద్ది’ సినిమా కోసమే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ మంగళవారం నుంచి మొదలుకానుంది. ఇందులో టాకీపార్ట్‌తో పాటు పోరాట ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నారు. దీనికోసం రామ్‌చరణ్ తన ఫిజిక్‌ను సాలిడ్‌గా తీర్చిదిద్దుకున్నాడు. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.