మైదానమంతా జనసందోహం.. కథానాయకుడి రాకకోసం కేరింతలు.. అప్పడొచ్చాడు హీరో.. భుజంపై బ్యాట్‌ను మోస్తూ.. పెదవులమధ్య బీడీని అటూఇటూ కదిలిస్తూ.. ైస్టెల్‌గా పొగ వదులుతూ.. గ్రౌండ్లోకి పవర్‌ప్యాక్ ఎంట్రీ ఇచ్చాడు. నడుచుకుంటూ వెళ్తున్నాడు. మరోవైపు అతని మాటలు వినిపిస్తున్నాయి. ‘ఒకే పని సెసేనాకి, ఒకేనాగ బతికేనాకి ఇంత పెద్ద బతుకెందుకు?.. ఏదైనా ఈ నేలమీద ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటీ మళ్లీ.. సెప్మీ!..’ అంటూ గ్రీజులోకి ఎంటరై.. బ్యాట్ చేతబట్టి.. హ్యాండిల్‌ని నేలపై కొట్టి.. బలంగా బందిని బాదితే.. అది బౌండరీ దాటితే.. ఇక చెప్పేదేముంది! గూజుబంప్సే.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. దాని ముచ్చటే ఇదంతా. ఈ గ్లింప్స్‌లో ‘పెద్ది’గా రామ్‌చరణ్ స్క్రీన్ ప్రెజన్స్.. మాటల్లో పదును.. ఉత్తరాంధ్ర డిక్షన్ పలికిన తీరు.. ఆ బాడీ లాంగ్వేజ్ అభిమానులు పండుగ చేసుకునేలా ఉంది. హీరో పాత్రలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా ఈ గ్లింప్స్ ఉందని చెప్పొచ్చు.
వచ్చే ఏడాది మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు గ్లింప్స్ ద్వారా తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలను ఆకాశంలో కూర్చోబెట్టాడు దర్శకుడు బుచ్చిబాబు సానా. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.రత్నవేల్, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాత: వెంకటసతీశ్ కిలారు, సమర్పణ: మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాణం: వృద్ధి సినిమాస్.