Ram Charan | క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో మరో భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధమైనట్లు తెలుస్తుండగా, ఇప్పుడు హీరోయిన్ ఎంపిక టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే సుకుమార్ కెరీర్‌ను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ‘ఆర్య’ నుంచి ‘పుష్ప 2’ వరకు ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమాలో కొత్త హీరోయిన్‌కే అవకాశం ఇచ్చారు. ఒకసారి నటించిన కథానాయికను వెంటనే మరో సినిమాలో రిపీట్ చేయలేదు. ఇదే ఆయనకు సెంటిమెంట్‌గా మారింది.
అయితే ఈసారి రామ్ చరణ్ సినిమా కోసం ఆ సెంటిమెంట్‌ను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పలువురు నటీమణుల పేర్లు పరిశీలించినప్పటికీ, రష్మిక మందన్న పేరు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్‌తో ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాల్లో రష్మిక సక్సెస్‌ఫుల్‌గా పనిచేయడంతో, మరోసారి ఆమెనే ఎంపిక చేయాలనే అభిప్రాయం టీమ్‌లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్, రష్మిక మందన్న ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కలిసి నటించలేదు. ఈ ఫ్రెష్ పెయిర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్రబృందం భావిస్తోందట. అంతేకాకుండా ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతుండటం కూడా నిర్మాతలకు అదనపు బలంగా మారింది. ఆమె క్రేజ్ సినిమాకు అన్ని భాషల్లో మంచి బిజినెస్‌కు దోహదపడుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఒకవేళ రష్మికనే హీరోయిన్గా ఖరారు చేస్తే, సుకుమార్ తన కెరీర్లో తొలిసారి ఒకే హీరోయిన్ను వరుసగా రెండు చిత్రాల్లో తీసుకున్న దర్శకుడిగా నిలుస్తారు. అయితే ప్రస్తుతం ఇవన్నీ ప్రచారంలో ఉన్న వార్తలే. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే హీరోయిన్ ఎంపికపై పూర్తి స్పష్టత రానుంది.ఇక రష్మిక కెరీర్ విషయానికి వస్తే ఈ అమ్మడు నేషనల్ క్రష్‌గా దూసుకుపోతూ అన్ని భాషలలో వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో బిజీగా ఉంది.