Actor Ram Charan | మెగా ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చినా తన నటన, అభినయంతో ప్రత్యేక అభిమానగళాన్ని సంపాదించుకున్నాడు రామచరణ్. గతేడాది రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’తో తిరుగులేని క్రేజ్‌ను, మార్కెట్‌ను ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఆయన శంకర్‌తో ‘గేమ్‌చేంజర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్ ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ చివర్లో లేదంటే వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రామ్‌చరణ్ తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో పాల్గొన్నాడు.
ఈ సమావేశాల్లో రామ్‌చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి చిన్న హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం తాను భారతదేశాన్ని ఎక్కువగా అన్వేషించులనుకుంటున్నట్లు తెలుపుతూ.. హాలీవుడ్ దర్శకులు, నిర్మాతలతో తప్ప తన తదుపరి సినిమాల కోసం ఎక్కడికి ప్రయాణించాలనుకోవట్లేదని చెప్పాడు. దాంతో రామ్‌చరణ్ లైనప్‌లో హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఉండనున్నట్లు హింట్ ఇచ్చాడు. ఈ న్యూస్‌తో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక దీనితో పాటుగా కాశ్మీర్ గురించి తెలుపుతూ ‘నేను1986 నుంచి కాశ్మీర్‌కు వస్తున్నాను, మా నాన్న సినిమాల షూటింగ్స్ ఇక్కడ గుల్మార్గ్, సోనామార్గ్‌లలో జరిగాయి. నేను కూడా 2016లో ఇక్కడ షూట్ చేశాను. ఈ ప్రదేశంలో ఏదో అద్భుతం ఉంది. కశ్మీర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని’ చెప్పాడు.
Hollywood Project is Cooking 😉 🕺@AlwaysRamCharan 👑🦁#G20Summit #RamCharanForG20Summitpic.twitter.com/2oolKAWRuW
— Ujjwal Reddy (@HumanTsunaME) May 22, 2023