Ram Charan |మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా రీజినల్ ఇండస్ట్రీలో హిట్‌గా నిలిచి, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. చాలా కాలం తర్వాత చిరంజీవిని ఫుల్ ఫామ్‌లో చూసిన అభిమానులు ఈ సినిమాను పండగలా సెలబ్రేట్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించగా, ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రాన్ని అంత అద్భుతంగా నిర్మించినందుకు రామ్ చరణ్.. తన సోదరి సుస్మితకి క్యూట్ గిఫ్ట్ ఇచ్చారు.
సుస్మిత కొణిదెల రీసెంట్గా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. నాన్నకి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు.సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.ఇప్పుడు నీకు దిష్టి తగులుతుంది కాబట్టి ఇది వేసుకో అని రామ్ చరణ్ తన అక్కకి ఈవిల్ ఐ బ్రేస్‌లెట్‌ని గిఫ్ట్‌గా ఇచ్చాడని రామ్ చరణ్ సోదరి సుస్మిత తెలియజేశారు. తమ్ముడు చూపించిన ప్రేమపై మెగా డాటర్ ఫుల్ ఖుష్ అయింది. ఆమె చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇటీవల మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి పనితీరును ప్రశంసలతో ముంచెత్తారు. వింటేజ్ సెలబ్రేషన్స్‌ను తిరిగి తీసుకొచ్చిన ఘనత అనిల్‌కే దక్కుతుందని అన్నారు. ఈ సినిమా విజయం వెనుక ఉన్న కృషికి గుర్తింపుగా చిరంజీవి, అనిల్ రావిపూడికి ఖరీదైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.
విజయం ఇచ్చే ఆనందంపై చిరంజీవి మాట్లాడిన మాటలు ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినిమా సక్సెస్ అయిన తర్వాత తన కుమార్తె సుస్మిత అత్యంత ఉత్సాహంగా తనకు విషయం చెప్పిందని, తనకంటే ఆమెకే ఈ విజయం ఎక్కువ థ్రిల్ ఇచ్చిందని అన్నారు. సుస్మిత కొణిదెల ప్రొడ్యూసర్‌గా చేసిన ప్రయాణాన్ని చిరంజీవి గుర్తు చేశారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజుల్లో రంగస్థలం సినిమా కోసం రాజమండ్రి వీధుల్లో ఒక్క లుంగీ కోసం ఒంటరిగా తిరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఆమె కష్టపడి ఎదిగిన తీరు తనకు గర్వకారణమని అన్నారు. కుటుంబ నేపథ్యం ఉన్నా, సొంతంగా అనుభవం సంపాదించుకుని, చిన్న ప్రాజెక్టులతో మొదలు పెట్టి, చివరకు ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం నిజంగా ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సినిమా కోసం తాను ఒక్క పైసా పెట్టలేదని, పూర్తిగా ప్రొఫెషనల్‌గా సుస్మిత, సాహు గారపాటి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లారని వెల్లడించారు.