Game Changer Movie | నా బతుకు రోడ్డు వైండింగ్‌లో కొట్టేసిన బిల్డింగ్‌లా మారిపోయింది.. ఉండడానికి పనికిరాదు.. వదలడానికి మనసు రాదు అని త్రివిక్రమ్ ఒక అద్భుతమైన డైలాగ్ రాశాడు అ ఆ సినిమాలో..! ఇప్పుడు రామ్ చరణ్‌కు ఈ డైలాగ్ బాగా సూట్ అవుతుంది. అదేంటి అంత మాట అనేసారు అనుకుంటున్నారు కదా.. మేము చెప్పేది వింటే ఇదే పర్ఫెక్ట్ అంటారు. ట్రిపుల్ఆర్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తర్వాత శంకర్ లాంటి దర్శకుడితో సినిమా చేస్తే.. ఆ రేంజ్ మ్యాచ్ అవుతుందని చరణ్ ఆయనతో సినిమాకు కమిట్ అయ్యాడు. పైగా ఇది విజువల్ ఎఫెక్స్ట్తో సంబంధం లేని సినిమా.. కేవలం ఏడాదిలో ఔట్ పుట్ ఇస్తా అంటూ శంకర్ చెప్తే అందరూ గుడ్డిగా నమ్మేశారు.. కానీ ఆయన లోపల ఒరిజినల్ అలాగే ఉంది.
ఒక్కో సినిమా కోసం కనీసం మూడు సంవత్సరాలు తీసుకునే శంకర్.. చరణ్ సినిమాకు కూడా కొత్తగా ఏం చేయడం లేదు. పైగా ఈ చిత్ర షూటింగ్ నత్త నడకన జరుగుతుంది. ఒకేసారి ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు చేస్తుండడంతో అటు ఇటు కాకుండా కన్ఫ్యూజ్ అవుతున్నాడు శంకర్. దాంతో అనుకున్న దాని కంటే ఇంకా ఆలస్యం అవుతుంది. ఈ సినిమాకు పది రోజులు షూటింగ్ చేస్తే నెల రోజులు గ్యాప్ ఇస్తున్నాడు ఈ దర్శకుడు. దాంతో 2024లో అయిన చరణ్ సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే 2025 సంక్రాంతికి గేమ్ చేంజర్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఇదేగాని జరిగితే చరణ్ కెరీర్‌కు మరింత మైనస్ అవుతుంది. ఎందుకంటే ట్రిపులర్ లాంటి భారీ సక్సెస్ తర్వాత వెంటనే మరొక సినిమా చేసి విజయం అందుకుంటే మార్కెట్ మరింత పెరుగుతుంది. కానీ మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుంటే ఆ ప్రభావం బాగా గట్టిగానే ఉంటుంది. శంకర్ సినిమా సెట్స్ పై ఉండగానే బుచ్చిబాబు ప్రాజెక్ట్ ను కూడా పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. ఎలాగూ అయ్యే లేట్ అవుతుంది కాబట్టి రెండు సినిమాలు తక్కువ గ్యాప్ లో విడుదల చేయాలని చూస్తున్నాడు రామ్ చరణ్. కుదిరితే 2025లో సంక్రాంతికి శంకర్ సినిమాతో.. సమ్మర్లో బుచ్చిబాబు సినిమాతో రావాలని చూస్తున్నాడు. ప్లానింగ్ బాగానే ఉంది. కనీసం ఇదైనా వర్కౌట్ అయి ఉంటే బాగుండు అనుకుంటున్నారు చరణ్ ఫ్యాన్స్.