Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తన తదుపరి సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తన తదుపరి సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథల ఎంపిక నుంచి దర్శకుల వరకు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ బాలీవుడ్ దర్శకుడు చెప్పిన కథకు రామ్ చరణ్ నో చెప్పారంటూ తాజాగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.
రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌కు టాలీవుడ్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు చరణ్ నటనకు ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ విజయవంతమైన జోడీ మరోసారి కలిసి పనిచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాత్కాలికంగా ‘ఆర్సీ17’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం. దసరా సందర్భంగా సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లఖియా, రామ్ చరణ్‌ను కలిసి ఓ కథ వినిపించారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ఆ కథపై చరణ్ ఆసక్తి చూపలేదని, ప్రాజెక్టుకు అంగీకారం తెలపలేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తన కెరీర్లో కీలకమైన దశలో ఉన్న రామ్ చరణ్, బలమైన కథలు ఉన్న సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన నిజంగానే ఈ దర్శకుడి ప్రతిపాదనను తిరస్కరించారా? అందుకు కారణం ఏమిటి? అనే విషయాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. రామ్ చరణ్, అపూర్వ లఖియా గతంలో ‘జంజీర్’ సినిమాతో కలిసి పనిచేశారు. అమితాబ్ బచ్చన్ నటించిన అదే పేరుతో వచ్చిన హిందీ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. తెలుగులో ‘తుఫాన్’ పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా కథానాయికగా నటించగా, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఫలితం ఆయన కెరీర్లో ఓ చేదు అనుభవంగా మిగిలిపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

