Ram Charan | ఏపీఎల్ సీజన్-5 లాంచింగ్ వేడుకలకి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ .. మంగళగిరిలో క్రికెట్ సందడి
Ram Charan | ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-5కు నేడు ఘనంగా తెరలేవనుంది. వారం రోజుల పాటు సాగే ఈ టోర్నీకి గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా నిలవనుంది. జూన్ 24 నుంచి జూన్ 30 వరకు జరిగే ఈ పోటీల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Ram Charan | ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-5కు నేడు ఘనంగా తెరలేవనుంది. వారం రోజుల పాటు సాగే ఈ టోర్నీకి గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా నిలవనుంది. జూన్ 24 నుంచి జూన్ 30 వరకు జరిగే ఈ పోటీల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈసారి ఏపీఎల్ ప్రారంభ వేడుకలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇటీవల ‘పెద్ది’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ మంగళగిరి స్టేడియానికి రానుండటంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఆయన రాకతో ప్రారంభ వేడుకలు మరింత రంగులద్దుకోనున్నాయి.
ఏపీఎల్ సీజన్-5లో మొత్తం 12 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో ఎనిమిది లీగ్ మ్యాచ్‌లు, మూడు ప్లేఆఫ్ మ్యాచ్‌లు, ఒక ఫైనల్ మ్యాచ్ ఉంటాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన జట్లు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి.టోర్నీలో తొలి మ్యాచ్‌లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు సింహాద్రి విజాగ్ లయన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం జరగనుండగా, సాయంత్రం జరిగే రెండో మ్యాచ్‌లో భీమవరం బుల్స్ జట్టు క్యాపిటల్ అమరావతి రాయల్స్‌తో పోటీ పడనుంది. తొలి రోజు నుంచే ఆసక్తికరమైన మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ స్టేడియంలో తొలిసారి ఏపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించబడుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్టేడియంలో తాగునీరు, పార్కింగ్, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహార కేంద్రాలు వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేశారు.
ఆటగాళ్లకు కూడా అత్యాధునిక డ్రెస్సింగ్ రూములు, ప్రాక్టీస్ సదుపాయాలు, ఫిట్నెస్ ఏర్పాట్లు అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్‌ల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేశారు.ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్‌కు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఏపీఎల్ యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే మంచి వేదికగా మారింది. ఈ లీగ్ ద్వారా అనేక మంది యువ క్రికెటర్లు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగే అవకాశాలు పొందుతున్నారు. ఇక రామ్ చరణ్ హాజరుకానుండటంతో క్రీడాభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్టేడియానికి తరలివచ్చే అవకాశం ఉంది. క్రికెట్, సినిమా రంగాల కలయికతో ఏపీఎల్ సీజన్-5 ప్రారంభ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
View this post on Instagram
A post shared by APL – Andhra Premier League – Official (@andhrapremierleague)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- APL 5
- chief guest
- Mangalagiri
- peddi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

