Ram Charan-Upasana | గోబల్ స్టార్ రామ్చరణ్ భార్య ఉపాసన మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో అటు కొణిదెల ఫ్యామిలీ, ఇటు కామినేని ఫ్యామిలీ సంబురాల్లో మునిగిపోయారు. మెగా ప్రిన్సెస్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. ఇక ఆ రోజు హాస్పిటల్ వద్ద మెగా అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆస్పత్రి చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మెగా ఫ్యామిలీపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు.
పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా రామచరణ్, ఉపాసనలకు అభినందనలు వెల్లువెత్తాయి. కాగా శుక్రవారం ఉపాసన డిశ్చార్జీ అయింది. ఈ నేపథ్యంలో మెగా కపుల్ మీడియాతో మాట్లాడుతున్నారు. వారికి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఆడబిడ్డ పుట్టినందుకు ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులయ్యారు.
WELCOME Megaprincess ♥️#RamCharan #upasana pic.twitter.com/3Grb27a9SK
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) June 23, 2023