తెలుగు రియల్ హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి రూపొందించిన ఫిక్షన్ చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం ఇస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో తారక్ కొమురం భీం పాత్ర పోషంచగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించి అలరించనున్నారు.
రీసెంట్గా చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇందులో హీరోల ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు రోమాలు నిక్కపొడుచుకునేలా ట్రైలర్ చేసింది. ఈ ట్రైలర్‌పై సామాన్యులే కాదు.. సెలెబ్రిటీలు సైతం స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ట్రైలర్ అభిమానుల ఆకలి తీర్చిందనే చెప్పాలి. అయితే ట్రైలర్ చూశాక మనమే ఇంత థ్రిల్ అవుతుంటే, అందులో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ల రియాక్షన్ ఎలా ఉండి ఉంటుందో తెలుసుకోవాలని అనుకున్నారు.
ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీం ఓ వీడియో షేర్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ చూశాక, భీమ్ -రామ్ రియాక్షన్ ఇది అంటూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేసింది.ఇందులో ట్రైలర్ చూసిన అనంతరం రామ్ చరణ్.. రాజమౌళిని హత్తుకోగా, ఎన్టీఆర్ అతడిపై తెగ ప్రేమ కురిపించేశాడు. ఏందిది, ఇక మాములుగా ఉండదు అంటూ రాజమౌళిని ఆటపట్టించారు. ఈ వీడియో ఆకట్టుకుంటుంది.