వ్యక్తిగత జీవితాల గురించి గోప్యత పాటిస్తుంటారు సెలబ్రిటీలు. తమ సొంత విషయాలు వెల్లడించేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. ఏమో ఏదైనా జరగొచ్చు అనేది వాళ్ల ఆలోచన. ఈ విషయంలో నాయికలు మరీ నిక్కచ్చి. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇలాంటి తారే కానీ ఉన్నట్లుండి ఆ మధ్య తన భాయ్ ఫ్రెండ్ గురించి చెప్పేసింది. అతనితో కలిసి షికార్లు కొట్టే ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. ఎందుకిలా చేసిందంటే తాజాగా కారణం చెప్పిందీ భామ. రకుల్ స్పందిస్తూ…‘వ్యక్తిగత విషయాలను దాచడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కెరీర్ తోనే తీరిక లేని నేను ఈ ఒత్తిడి కూడా తీసుకోదల్చుకోలేదు. అయినా మరొకరి వ్యక్తిగత జీవితాల గురించి ఇతరులకు ఇంత ఆసక్తి ఎందుకో అర్థం కాదు. తల్లిదండ్రులు, అన్నాచెల్లి ఉన్నట్లే మనకో జీవిత భాగస్వామి ఉంటారు. అందులో వింతేముంది’ అని అంది. తెలుగులో హవా తగ్గిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్లో కెరీర్ వెతుకుంటున్నది. ఆమె జాన్ అబ్రహాంతో కలిసి నటించిన ‘అటాక్’ సినిమా ఇటీవల విడుదలైంది. ఇది కాక రకుల్ నటించిన ‘రన్ వే 34’, ‘మిషన్ సిండ్రెల్లా’, ‘డాక్టర్ జి’, ‘థాంక్ గాడ్’..వంటి మరో నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.