ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేతో పాటు రాఖీ పండుగ. ఈ రెండింటిని కంబైన్డ్‌గా సెలబ్రేట్ చేసింది భోళా శంకర్ టీం. చిరు తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ లో భాగంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి భోళా శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేసి కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు మేకర్స్. ఈ టైటిల్ చాలా బాగుందని ప్రశంసలు లభించాయి.
భోళా శంకర్ చిత్రంలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటించనుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. రాఖీ సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే వీడియోను వదిలి ప్రచారాలని నిజం చేసింది చిత్ర బృందం. అన్నయ్య చిరుకు కీర్తి సురేష్ రాఖీ కడుతున్న వీడియోను విడుదల చేసి.. చెల్లెలందరి రక్షా బంధం, అభిమానులందరి ఆత్మ బంధం, మనందరి అన్నయ్య జన్మదినం అంటూ కొటేషన్ కూడా ఇచ్చారు.
చిరు లుక్‌తో పాటు కీర్తి సురేష్ లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే కీర్తి సురేష్ సూపర్ స్టార్ రజినీ అన్నాత్తె సినిమాలో చెల్లిగా నటిస్తున్నారు. రజినీకాంత్‌కు చెల్లిగా నటించడంతో.. భోళా శంకర్ టీం చిరుకి చెల్లెలిగా నటిస్తావని అడగడంతో వెంటనే ఓకే చెప్పేసిందట. మాస్కు కావాల్సిన యాక్షన్ పార్ట్, ఫ్యామిలీకి కావాల్సిన ఎమోషన్ అన్నీ కూడా ఇందులో ఉండబోతోన్నాయి.