Rakhi Celebrations | దేశమంతా రక్షాబంధన్ ఉత్సవాల్లో మునిగిపోయింది. అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రత్యేక పండుగను దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీలోనూ రాఖీ సంబరాలు సంతోషంగా జరిగాయి. మెగా డాటర్ నిహారిక కొణిదెల , తన అన్నయ్య, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కి రాఖీ కట్టి తన ప్రేమను చాటారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి సంవత్సరం పండుగల వేళ మెగా ఫ్యామిలీ సభ్యులు ఒకచోట చేరి ఉత్సాహంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా రాఖీ పండుగను అంతే ఉల్లాసంగా జరుపుకున్నారు. ఈ పిక్స్ చూసి మెగా అభిమానులు ఖుషీ గా ఉన్నారు.
వరుణ్ తేజ్‌కి కూడా రాఖీ కట్టింది నిహారిక. ఈ రాఖి పండుగకి ఎక్స్ట్రా లవ్ ని ఫీల్ అవుతున్నానని తెలిపింది. దీనితో ఇవి చూసిన అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ తన భారీ చిత్రం పెద్ది చేస్తుండగా వరుణ్ తేజ్ తన కెరీర్ 15వ సినిమాగా చేస్తున్నారు. వీటిపై ప్రస్తుతం మంచి బజ్ నెలకొంది.
బాలయ్య తన సోదరి ప్రముఖ రాజకీయ నాయకురాలు పురందరేశ్వరితో కలిసి రాఖీ జరుపుకుంటున్న విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో ఇద్దరు అక్క తమ్ముళ్ల నడుమ క్యూట్ విజువల్స్ ఎంతో ముచ్చటగా ఉన్నాయి. అక్క, తమ్ముళ్ల అనుబంధం చాలా బాగుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
హీరో అడివి శేష్ ఇంట కూడా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. శేష్ తన సోదరితో రాఖీ కట్టించుకున్నాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నేడు రాఖీ సందర్భంగా తమ్ముడు అమన్ కి రాఖీ కట్టిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మిగతా స్టార్స్ కూడా తమ సిస్టర్స్‌తో రాఖీ వేడుకలని ప్రత్యేకంగా జరుపుకున్నారు.
Rakhi
#RakshaBandhan2025 Celebrations❤️😍#Balayya @PurandeswariBJP garu😍
Happy #RakshaBandhan to all❤️#NandamuriBalakrishna #Akhanda2 pic.twitter.com/5i7CJ9sVJZ
— manabalayya.com (@manabalayya) August 9, 2025