99 Rupees Ticket | టాలీవుడ్ నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఈ మూవీపై బంపరాఫర్‌ని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమా టికెట్ ధరను తగ్గించినట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో సింగిల్ థియేటర్లలో ఈ చిత్రం రూ.99లకే అందుబాటులో ఉండబోతుండగా.. మల్టీప్లెక్స్‌లలో రూ.105గా నిర్ణయించినట్లు చిత్రబృందం తెలిపింది. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో అఖిల్, తేజస్విని జంటగా నటిస్తుండగా.. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వేణు వుడుగుల నిర్మిస్తుండగా.. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.