రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా..’ అంటూ సాగే తొలి గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. అనిరుధ్ స్వరపరచిన ఈ పాటను శిల్పారావు, అనిరుధ్ కలిసి ఆలపించారు. పాటలో బీట్‌కు అనుగుణంగా రజనీకాంత్, తమన్నా వేసిన స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి.
గ్యాంగ్‌స్టర్ నేపథ్య కథాంశంతో సాగే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని సమాచారం. ‘ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. ఆయన ైస్టెల్, సంభాషణలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి’ అని చిత్రబృందం పేర్కొంది. మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: అనిరుధ్, రచన-దర్శకత్వం: నెల్సన్ దిలీప్‌కుమార్.