రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘చంద్రముఖి’ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. దక్షిణాది బాక్సాఫీస్ బరిలో రికార్డులను క్రియేట్ చేసింది. ప్రస్తుతం లారెన్స్ కథానాయకుడిగా దర్శకుడు పి.వాసు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్లో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనుందని తెలిసింది. చంద్రముఖిలో జ్యోతిక పాత్ర మంచి గుర్తింపు దక్కించుకోవడంతో సీక్వెల్లో నటించడానికి కాజల్ అగర్వాల్ ఆసక్తిగా ఉందని చెబుతున్నారు.
సీక్వెల్లో కథ, కథనాలు ఎక్కువగా నాయిక పాత్ర చుట్టే సాగుతాయని, అభినయపరంగా కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ సీక్వెల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత కాజల్ సెట్స్‌మీద అడుగుపెట్టబోతున్నది. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘ఇండియన్-2’ ద్వారా కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి పునరాగమనం చేయబోతున్నది.