Thalaivar170 | జైలర్‌తో వీర లెవల్లో కంబ్యాక్ ఇచ్చిన రజనీ.. అదే ఊపుతో తన 170వ సినిమా చేస్తున్నాడు. జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువునంతపురంలోని అగ్రీకల్చర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ మధ్యే ఓ మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసిన సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక సోమవారం షూటింగ్ ముగించుకుని చెన్నై వెళ్లేందుకు కన్యాకుమారి నుంచి తూత్తుకుడి వాగైకులం ఎయిర్‌పోర్టుకు రజనీకాంత్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా అతడిని పాత్రికేయులు చుట్టుముట్టగా.. రజనీకాంత్ మాట్లాడుతూ.. చెన్నైకు వెళుతున్నట్లు తెలిపాడు. ‘లియో’ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా ఆ మూవీ గురించి మాట్లాడమని అడుగగా ‘లియో’ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నట్లు రజనీ తెలిపాడు.
ఇక కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). త్రిష హీరోయిన్గా నటిస్తుండగా.. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా.. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.