Thalaivar 173 | ఏంటీ రజినీకాంత్ డైరెక్టర్ మళ్లీ మారాడా.. తలైవా 173 కొత్త డైరెక్టర్ ఎవరో తెలుసా..?
Thalaivar 173 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న Thalaivar 173 సినిమా సెట్స్‌పైకి వెళ్లడం మాట అటుంచితే డైరెక్టర్ విషయంలో మాత్రం ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.
Thalaivar 173 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులకు వినోదాన్ని అందించడమే ధ్యేయంగా వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. రజినీకాంత్ నటిస్తోన్న సినిమాల్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ Thalaivar 173. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం మాట అటుంచితే డైరెక్టర్ విషయంలో మాత్రం ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతల నుంచి డైరెక్టర్ సుందర్ సీ తప్పుకున్నాడని తెలిసిందే. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ డాన్, తేరి, మెర్సల్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ సిబి చక్రవర్తి చేతుల్లోకి వెళ్లింది. ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించేశారు మేకర్స్.
అయితే ఇప్పుడు ఈ మూవీకి మరోసారి డైరెక్టర్ మారాడన్న వార్త నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తుతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారని ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏం లేకున్నా మూవీ లవర్స్‌తోపాటు అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోతుంది. మరి రాబోయే రోజుల్లో తలైవా టీం ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ చేస్తుందా.. అనేది చూడాలి.
రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్ జైలర్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. జైలర్ 2ను 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు వార్తలు రాగా.. ఇండిపెండెన్స్ డే వీకెండ్ టైంలో జైలర్ 2 విడుదలకు ప్లాన్ చేస్తున్నారని ఇటీవలే ఓ న్యూస్ తెరపైకి వచ్చింది.
జైలర్ 2లో బాలీవుడ్ భామ విద్యాబాలన్‌తోపాటు కోలీవుడ్ యాక్టర్ సంతానం కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తుండగా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. జైలర్ ఫస్ట్ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. కాగా సీక్వెల్లో ఎవరెవరుండబోతున్నారన్నదానిపై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Read Also :
Jadcherla | పది రోజులుగా నీళ్లు బంద్..ఖాళీ బిందెలతోజడ్చర్ల మున్సిపాలిటీ ఎదుట ధర్నా
UK Migrant Rules | పదేళ్ల ఆవాసం తర్వాతే యూకేలో శాశ్వత నివాసం.. నిబంధనలు కఠినతరం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

