Bobby Kolli| మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు (Bobby Kolli) బాబీ (కేఎస్ రవీంద్ర). ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు బాబీ. ఈ యువ దర్శకుడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్దం చేశాడని.. తలైవా, బాబీ కాంబోలో సినిమా రాబోతుందని..టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే సిల్వర్ స్క్రీన్‌పై బాబీ, తలైవా కాంబినేషన్ ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలు అడియాశలైనట్టు కనిపిస్తున్నాయి. రజినీకాంత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని తాజా మరో వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. అయితే రజినీకాంత్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలేంటనేది మాత్రం తెలియరాలేదు. సూపర్ స్టార్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి.. వెళ్లిపోవడంతో షాక్‌కు గురయ్యాడట బాబీ.
ఇదిలా ఉంటే బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో రజినీకాంత్ సినిమా చేయబోతున్నాడంటూ మరో క్రేజీ టాక్ కూడా తెరపైకి రాగా.. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ బింబిసార 2 కోసం మరో దర్శకుడి వేటలో పడ్డాడన్న టాక్ కూడా ఉంది. మిగితా వివరాలెలా ఉన్నా.. బాబీ, రజినీకాంత్, దిల్ రాజు సినిమా రావడం ఇక కష్టమేనన్న వార్తలతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.
రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న జైలర్ షూటింగ్ దశలో ఉంది. ఇది తలైవాకు 169వ ప్రాజెక్ట్. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. కాగా రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)కూడా ప్రకటించేశాడు. లోకేశ్ కనగరాజ్, రజినీకాంత్ కాంబోలో తలైవా 171 కూడా రాబోతుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..