Jailer Movie | నిన్న చెన్నైలో జైలర్ ప్రీ రిలీజ్ వేడుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో అనురుధ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఒకెత్తయితే.. తలైవా స్పీచ్ మరో ఎత్తు. రజనీ స్పీచ్‌కు పడి పడి నవ్వని వారు లేరు. నవ్వించే విషయాలతో పాటు రజనీ మంచి మాటలు కూడా స్పీచ్‌లో భోదించాడు. ఇక ముఖ్యంగా సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారణ్ గురించి మాట్లాడి అందరిలో చిరునవ్వులు చిందించాడు. కావ్యాను టీవిలో అలా చూడలేక ఛానల్ మార్చేసేవాడినని సరదాగా మాట్లాడాడు.
సన్ పిక్చర్స్ అధినేత, సన్ రైజర్స్ ఫౌండర్ కళానిధి మారణ్ జైలర్ సినిమాకు నిర్మాత. కాగా ఈ వేడుకలో కళానిధిని ఉద్దేశిస్తూ.. సన్ రైజర్స్ జట్టు మ్యాచ్ ఓడిపోయినప్పుడు కావ్య మారన్ పడే బాధను చూడలేకపోతున్నాను. స్టేడియంలో కావ్య నిరాశగా ఉండటం చూసి.. చాలాసార్లు చూడలేక ఛానల్ కూడా మార్చేసే వాడిని. ఈ సారి ఆక్షన్‌లో మంచి ప్లేయర్లను తీసుకోవాలి. టీమ్‌లో మంచి ప్లేయర్ ఉండాలి. ఆడుతున్న ప్రతి మ్యాచ్ గెలవాలనే కసి ఉన్న క్రికెటర్లకు జట్టులో చోటు కల్పించాలి అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక తమిళంలో హాట్ టాపిక్‌గా మారిన ఫెఫ్సీ రూల్స్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ కూడా ఇచ్చాడు. బీస్ట్ రిజల్ట్ చూసి చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు నెల్సన్‌తో సినిమాను చేయొద్దని చెప్పినట్లు రజనీ వెల్లడించారు. కానీ తనకు, ప్రొడ్యూసర్‌కు నెల్సన్‌పై పూర్తి నమ్మకముందని.. సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పాడు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, ప్రియాంక అరుళ్మోహన్ వంటి స్టార్ కాస్ట్ ఉంది. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఆగస్టు 10న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది.